calender_icon.png 18 September, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగో రోజుకు చేరిన నిరసనలు

09-02-2025 01:02:22 AM

పటాన్‌చెరు, ఫిబ్రవరి 8: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి పంచాయతీ ప్యారానగర్‌లో ఏర్పాటు చేస్తున్న డంప్‌యార్డుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూ నే ఉన్నాయి. గ్రామస్థులు, మండల ప్రజలు చేపట్టిన నిరసనలు శనివారం నాటికి నాలు గో రోజుకు చేరుకున్నాయి. నల్లవల్లి గ్రామం లో చేపట్టిన ఆందోళనకు సీపీఎం నాయకు లు మద్దతు తెలిపారు.

రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తక్షణమే డంప్‌యార్డు పను లు నిలిపేయాలని, శాశ్వతంగా డంప్‌యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు నల్లవల్లి ప్రధాన చౌరస్తా, గుమ్మడిదల, బొంతపల్లి కమాన్ వద్ద పోలీస్ క్యాం పులు కొనసాగుతున్నాయి. పోలీస్ పహార మద్య ప్యారానగర్‌లో డంప్‌యార్డు పనులు జరుగుతూనే ఉన్నాయి.