02-05-2025 12:42:54 AM
శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన కార్పొరేటర్ లచ్చిరెడ్డి
ఎల్బీనగర్, మే 1 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో శిలాఫలకంపై ప్రోటోకాల్ రగడ ర గులుకున్నది. శిలాఫలకలో స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రోటోకాల్ ప్రకారం లేకపోవడంతో శిలాఫలకాన్ని ధ్వంసం చేసి న కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, బీజేపీ రం గారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనేపల్లి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ ఎన్జీవోస్ కా లనీలో పౌర గ్రంథాలయ ఆవరణలో గురువారం నూతన గ్రంథాలయ నిర్మాణ పనుల కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే శిలాఫలకంలో సరైన విధంగా ప్రోటోకాల్ పాటించ లేదంటూ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అ భివృద్ధి కార్యక్రమాల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం సమయంలో కార్పొరేటర్ అత డి అనుచరులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశా రు. ప్రోటోకాల్ అంశంలో అధికారులపై రా జకీయ ఒత్తిడి ఎక్కువ కావడంతోనే మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేరు ను ప్రోటోకాల్ ప్రకారం పెట్టలేదని శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అధికారుల తీరుపై కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనేపల్లి శ్రీనివాస్ రెడ్డి, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రంథాలయ సిబ్బంది ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసుు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.