21-08-2025 06:25:16 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సెంట్రల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రమణ(Central Nodal Officer Dr. Ramana) అన్నారు. గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాళేశ్వరం, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం బ్రాహ్మణపల్లి సెంటర్లను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి బీపీ, షుగర్, గర్భిణీ స్త్రీలు, డెలివరీలు, రక్తహీనత గల పిల్లల వివరాలను అడిగి తెలుసుకొని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్. సి.వి.బి.డి.సి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమాదేవి, జిల్లా ఇమ్యు నైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ప్రమోద్, ఎన్.సి.డి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సందీప్, డి.పీ.ఎం.ఓ చిరంజీవి, డాక్టర్ సుస్మిత, ఎం.ఎల్.హెచ్.పి మమత, పీ.హెచ్. ఎన్. నీరజ, హెల్త్ అసిస్టెంట్ ఆడప రాజా రమణయ్య, ఏఎన్ఎం లు హేమలత, వెంకటమ్మ ఆశాలు పాల్గొన్నారు.