21-08-2025 06:28:20 PM
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి..
వెల్దుర్తి (విజయక్రాంతి): వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి(Constituency in-charge Aavula Raji Reddy) చేతులమీదుగా అర్హులైన 16 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆరు లక్షల 79 వేల రూపాయల విలువగల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని రకాల వైద్య చికిత్సల నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, నరసింహారెడ్డి, జగ్గశంకర్ గౌడ్, తలారి మల్లేష్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.