calender_icon.png 13 September, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్త కళాకారులకు ఉపాధి కల్పించండి

13-09-2025 03:39:31 AM

  1. ఇండస్ట్రీస్ కామర్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్
  2. రాంనగర్‌లో చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం

ముషీరాబాద్, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి అస్త కళాకారులకు ఉపాధిని కల్పించాలని హ్యాండ్లూమ్ వీవర్స్ కోపరేటివ్ సొసైటీని ఆదుకోవాలని ప్రోత్సహించాలని ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, టెస్కో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ రామయ్య విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం టెస్కో ఆధ్వర్యంలో రాంనగర్ లోని రాజ్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను శైలజ రామయ్యర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగంపై ఆధారపడిన చేనేత కళాకారులు తయారు చేసిన నాణ్యమైన వస్త్రాలకు మార్కెటింగ్  కల్పించటం, వినియోగదారులకు నాణ్యమైన చేనే త వస్త్రాలు సరసమైన ధరలకు అందించటమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర చేనే త సహకార సంఘం (టెస్కోTGSCO) పనిచేస్తుందన్నారు. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి నవంబర్11వ తేదీ వరకు రెండు నెలల పాటు కొనసాగే ఈ వస్త్ర ప్రదర్శనలో 50%, 60%, 70% ప్రత్యేక తగ్గింపు ధరలలో అమ్మ కాలు జరుపబడుచున్నవని తెలిపారు.

రాష్ట్రంలో ఉత్పత్తి అయిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేత వస్త్రాలైన పోచంపల్లి, ఇక్కత్,  గద్వాల,   నారాయణపేట,  గొల్లభామ పట్టు చీరలు, సీకో చీరలు,  కాటన్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్స్, లుంగీలు,  టవళ్ళు దుప్పట్లు, కలంకారి, ఖాదీ వస్త్రాలతో పాటు రాజమండ్రి,  వెంకటగిరి, బందరు, ధర్మవరం చీరలు ప్రదర్శనకు ఉంచడం జరిగిం దన్నారు. ఈ కార్యక్రమంలో టెస్కో మేనేజింగ్ డైరెక్టర్లు రఘునందన్ రావు, ఓ ఎస్ డి రతన్ కుమార్, టెస్కో ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, ప్రెసిడెంట్ విజయ్ కుమార్, డివిజనల్ మార్కెటింగ్ అధికారి కళింగ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్లు సందీప్ జోషి, కేటి చారి, మాధవి,  శ్రీలత తదితరులు పాల్గొన్నారు.