calender_icon.png 13 September, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రేడ్ ఎక్స్ ఫో పోస్టర్ ఆవిష్కరణ

13-09-2025 03:39:36 AM

బెల్లంపల్లి అర్బన్, సెప్టెంబర్ 12 : బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో బెల్లంపల్లి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ చేతుల మీదుగా ట్రేడ్ ఎక్స్ ఫో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మనోజ్ మాట్లాడుతూ ఈ నెల 19, 20, 21 తేదీల్లో హైదరాబాద్ నార్సింగ్ లోని ఓం కన్వెన్షన్ హల్ లో జరుగనున్న ఎక్స్ ఫో లో కొత్త పరికరాలు, డిజిటల్ టెక్నాలజీలు దోహదపడుతాయన్నారు. యువత ఈ రంగాన్ని వృత్తిగా ఎంచుకోవడం ద్వారా మంచి అవకాశాలను పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్వాస తిరుపతి, జిల్లా కోశాధికారి ముక్కెర శ్రీనివాస్, బెల్లంపల్లి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కుంభాల రాజేష్, అధ్యక్షులు ఆకుల వేణు, ప్రధాన కార్యదర్శి కంపెల్లి విజయ్, కోశాధికారి మడుపు విక్రమ్, జిల్లా మాజీ కార్యదర్శులు కాంపెల్లి శంకర్ బాబు, ఆకునూరి రాజ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతరవేణి తిరుపతి, కోశాధికారి ముక్కెర శ్రీను, మెరుగు పోషం, ప్రసాద్, ప్రేమ్ దాస్, కట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.