13-09-2025 03:38:29 AM
ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ను కలిసిన అంగన్వాడీ టీచర్లు
అదిలాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి)/ఖానాపూర్: అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. ఖానాపూర్ డివిజన్‌లోని అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వారి సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఖానాపూర్ ప్రాజెక్టుకు రెగ్యులర్ సిడిపిఓ ను నియమించాలని, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు నెలసరి జీతం రూ.18 వేలకు పెంచాలని, అంగన్వాడీ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. వారి సమస్యలను విన్న ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు