calender_icon.png 29 September, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని డివిజన్ మున్నూరు కాపు భవన నిర్మాణం కోసం కోటి రూపాయల నిధులు ఇవ్వండి

29-09-2025 12:00:00 AM

మంత్రి శ్రీధర్ బాబు కోరిన మంథని మున్నూరు కాపు నేతలు

మంథని, సెప్టెంబర్ 28(విజయ క్రాంతి) మంథని లో మున్నూరు కాపు సంఘం కా ర్యకలాపాల కోసం, శుభ కార్యాల నిర్వహణ కోసం, రాబోయే తరాలకు అవసరమైన డిజిటల్ లైబ్రరీ, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణం కోసం కోటి రూపాయల ప్రభుత్వ నిధులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు మం థని డివిజన్ మున్నూరు కాపు సంఘం ఆ ధ్వర్యంలోని పలువురు నేతలు వినతిపత్రం అందించారు.

ఈ మేరకు హైదరాబాద్ లో ఓ ప్రయివేట్ కార్యక్రమంలో శనివారం రాత్రి మంత్రిని కలిసిన కాపు సంఘం నేతలు మా ట్లాడుతూశ మంథని నియోజకవర్గం పరిధిలో గల 10 మండలాల్లో వ్యవసాయం, ఇతర వృత్తులను నమ్ముకొని పెద్ద సంఖ్యలో కాపు కుల సోదరులు ఉన్నారని, జనాభా ప్రకారంగా కూడా నియోజకవర్గం లో కాపు లు అధిక సంఖ్యలో ఉన్నారని, రాజకీయం గా , ఆర్థికంగా, సామాజికంగా కాపు సంఘం సభ్యులు ఇప్పటికీ వెనుకంజలోనే ఉన్నారన్నారు.

కాపు కుల సంఘం ఐక్యత కోసం గత కొన్ని ఏండ్లుగా గ్రామగ్రామాన కుల సం ఘాలు ఏర్పాటు చేసుకొని ఉన్న మంథని డివిజన్ కేంద్రంలో సంఘం అవసరాల కో సం, సమావేశాల నిర్వహణ కోసం, శుభ కార్యక్రమాల నిర్వహణ కోసం స్వంత స్థలం కానీ, భవనం కానీ లేకపోవడం చాలా ఇ బ్బందిగా ఉందని, కాపులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే మీ హయాంలో స్థలాన్ని మంథని కేంద్రంలో  కేటాయించి సంఘ భవన, క మ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కోటి రూ పాయల ప్రభుత్వ నిధుల మంజూరుకు కృ షి చేయాలని కోరారు.

ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్న మంత్రి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ లు ఇస్తూ తీసుకున్న చారిత్రక నిర్ణయానికి మంత్రివర్గ సభ్యులకు ము న్నూరు కాపు సంఘం తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం పరిధిలో బీసీ వర్గాల్లో అత్యధిక శాతం ఉన్న కాపు సంఘం సభ్యులకు కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వుడు స్థానాల్లో అత్యధిక స్థానాలు కేటా యించి కాపులకు తగు ప్రాధాన్యత ఇచ్చి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని ఆ వినతి పత్రంలో కోరారు.

ఈ కార్యక్ర మంలో మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్, జిల్లా మున్నూరు కాపు మహాసభ కన్వీనర్ సతీష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల కిరణ్, మంథ ని మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సీపతి బానయ్య, మాజీ ఎంపిటిసి ఎడ్ల సత్యనారాయణ, మంత్రి వ్యక్తిగత సహాయకులు ఇసం పల్లి శ్రీకాంత్, మాజీ సర్పంచ్ లు ఐలి శ్రీనివాస్,

సేమంతుల ఓదెలు, కుడుదుల కో టేశ్వర్, సింగిల్ విండో డైరెక్టర్ కొత్త శ్రీనివాస్, మంథని పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పెంటరి రాజు లతో పాటు మం థని డివిజన్ కు చెందిన మున్నూరు కాపు సంఘం నాయకులు కూర కోటేష్, ఐలి రవి, బొడ్డు శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, లైశెట్టి రాజు, బాసాని రమేష్, నరెడ్ల ఓదెలు, సిలివేరు మహేందర్, తొగరి ఓదెలు, తుంగల స త్తయ్య, కుడుదుల మహాదేవ్,

ఎడ్ల సుమంత్, కొండ మహేందర్, చీపిరి శెట్టి రాజన్న, చాట్లపల్లి సంతోష్, సుంకరి మల్లికార్జున్, ఇసం పల్లి నారాయణ, ఇసంపల్లి శ్రీను,మా నెం రాజేందర్, పెరుగు తేజ, కోరవేన రవి, దొడ్ల కమలాకర్, దొబ్బల రమేష్, కూర శంకర్, కురుమ శెట్టి సతీష్, లక్కాకుల సత్యనారాయణ, పోగుల సాగర్, చెరుకు తోట సురేష్ లతో పాటు సంఘం నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.