29-09-2025 12:00:00 AM
కోదాడ, సెప్టెంబర్ 28 : పట్టణంలోని ఎంఎస్ జూనియర్ కళాశాలలో 1998-2000 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ సిఇసి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం స్థానిక కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు .25 ఏళ్ల తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు . చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
అనంతరం నాటి అధ్యాపకులను ఘనంగా సన్మానించుకుని ఆనందంగా గడిపారు .ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి, విద్యార్థులు కొట్టే సైదులు , ఇర్ల భూపతి రెడ్డి ,ప్రదీప్ ,వీరభద్రం, శ్రీహరి ,కళ్యాణ్ చక్రవర్తి ,సురేందర్ రెడ్డి , వాసవి తదితరులు ఉన్నారు