29 April, 2026 | 10:53 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి

05-03-2026 12:18 AM

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ఆలేరు, మార్చి 4 : బాలసదనంలో ఉన్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం భువనగిరి లో గల మీనానగర్‌లో బాలసదనంను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మిక తనిఖీ చేశారు. బాలసదనంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారని, అటెండన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు.

ఎంత మంది విద్యార్థులు ఉన్నారని, విద్యార్థులు ఏ ఏ తరగతులు చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. బాలసదనంలో ఉన్న పిల్లలతో కలెక్టర్ ముచ్చటించి, రుచికరమైన భోజనం అందిస్తు న్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకొని, విద్యార్థులను మీకు ఏమి అయినా కావాలా అని అడగగా పిల్లలు మ్యూజిక్ టీచర్ కావాలని తెలుపగా  పిల్లల కోరిక మేరకు మ్యూజిక్  టీచర్ ను తాత్కాలికంగా నియమించాలని  సంబంధిత అధికారులను అదేశించారు. విద్యార్థులందరికీ హెల్త్ ప్రొఫైల్  ఉందా అని అడిగి తెలుసుకున్నారు.

బాలసదనంలో వాటర్ ఫిల్టర్ పనిచేయడం లేదని తెలపడంతో  వెంటనే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బెడ్ షీట్‌లు సరిగా లేకపోవడంతో కొత్త బెడ్ షీట్లు ఇవ్వాలని సూచించారు. అనంతరం  నిర్మాణంలో ఉన్న బాలసదనం భవనం  యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో  జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు. మున్సిపల్ కమిషనర్ రామలింగం భువనగిరి తహసీల్దార్ జగన్ మోహన్ ప్రసాద్. బీ ఆర్ బీ కో ఆర్డినేటర్ అనంత లక్ష్మీ, యశోద, బాలసదన్ సిబ్బంది, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.