calender_icon.png 22 December, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సహాయం అందజేత

22-12-2025 12:00:00 AM

లక్షెట్టిపేట టౌన్, డిసెంబర్ 21 : లక్షెట్టిపేట మండలంలోని చందారం రేషన్ డీలర్ రామాంజనేయులు ఇటీవల గుండె పోటు తో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా రేషన్ డీలర్ల  సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోట పలుకుల సత్తయ్య మాట్లాడు తూ జిల్లాలో ఏ రేషర్ డీలర్ కు అయినా ఆపద వస్తే వారి కుటుంబానికి ఖచ్చితంగా సంఘం తరపున అండగా ఉండి ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆసాది సుధాకర్, జిల్లా వర్కిం గ్ ప్రెసిడెంట్ కృష్ణ, మంచిర్యాల మండల అధ్యక్షుడు మహేందర్, దండేపల్లి మండల అధ్యక్షుడు మల్లేష్, డీలర్లు సలీం, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.