బాధితులకు న్యాయం చేయాలి
317 జీఓ బాధితులను ఆదుకోవాలి
సీఎం రేవంత్ రెడ్డిని కోరిన పీఆర్టీయూ తెలంగాణ నేతలు
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఉమాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పార్వతి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బదిలీలు, ప్రమోషన్ల కంటే ముందే 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఉపాధ్యాయులకు న్యాయం చేసేందుకే 317 జీవో సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం తెలిపారు. సీఎంను కలిసిన వారిలో నాయకులు శ్రీశైలం, మల్లేశ్, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






