09-01-2026 12:00:00 AM
కత్తితో దాడికి యత్నం
సెక్యూరిటీ గార్డ్ సాహసంతో తప్పిన ప్రమాదం
మహబూబాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కత్తులతో సైకో వీరంగం చేశాడు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి వస్తువులను ధ్వంసం చేసి రోగులను కత్తితో పొడుస్తానని బెదిరించడంతో ఆసుపత్రిలో ఉన్న రోగులు వైద్య సిబ్బంది ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన చూసిన పలువురు సెక్యూరిటీ గార్డును అక్కడికి చేరుకోవడంతో డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి లోపల నుంచి గడియ పెట్టుకొని గొంతు కోసుకున్న సైకో.. అయితే సెక్యూరిటీ గార్డ్ కొమ్ము శరత్ ధైర్యంతో తలుపులు పగలగొట్టి సైకోను చాకచక్యం గా ఒడిసి పట్టుకొని అతని చేతులు నుండి కత్తిని లాక్కున్నారు. దీనితో ఆసుపత్రిలో నెలకొన్న ఉత్కంఠకు స్థిరపడింది. సైకోను ఒడిసి పట్టుకొని పెద్ద ప్రమాదాన్ని తప్పించాడని సెక్యూరిటీ గార్డ్ శరత్ను పలువురు అభినందించారు. కత్తితో గొంతు కోసుకున్న సైకోకు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు.