పబ్బులపె దాడులు
పలువురికి డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు, ఆరుగురికి పాజిటివ్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని పబ్బులపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టీజీన్యాబ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వ హించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌళి తదితర ప్రాంతాల్లోని 25 పబ్బులలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు ఈ పబ్బులలో విస్తృత సోదా లు నిర్వహించారు.
ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్ ఖురేషీ పర్యవేక్షణలో ఈ దాడులు కొనసాగాయి. దాదాపు 130 మంది థైతరువాయి అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్‌ల తో పరీక్షలు నిర్వహించగా వారిలో ఆరుగు రు డ్రగ్స్ సేవించినట్లుగా నిర్ధారణ అయ్యినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్లు అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్ కిషన్, అడిషనల్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీలు తుల మనో హర్‌రావు, తిరుపతియాదవ్, సీఐలు రాజశేఖర్, సంతోష్‌కుమార్, వెంకట్, వెంకటరమ ణ తదితరులు పాల్గొన్నారు. జోరాపబ్, క్లబ్‌రోగ్ పబ్, విస్కీసాంబ అనే పబ్‌లలో ఇద్దరు చొప్పున అభిషేక్ శ్రీవాత్సవ, అబ్ధుల్ ఘని, శశావత్ మహాపాత్ర, మరితబాను, మీర్ అబిద్‌అలీతో పాటు మరో వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
క్షణాల్లో పట్టిస్తున్న డ్రగ్స్ డిటెక్షన్ కిట్లు
నగరంలో మత్తు పదార్థాల నిర్మూలన కోసంలో నగరంలోని ధూల్‌పేట్ గంజాయి ని కంట్రోల్‌లోకి తెచ్చినట్లు ఇటీవల అధికారులు ప్రకటించారు. అయితే అందులో భాగంగానే డ్రగ్స్ నిర్మూలన కోసం ఎక్సైజ్ అధికారులు టీజీన్యాబ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ పనితీరుకు తోడు టీజీన్యాబ్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం కూడా తోడవడంతో డ్రగ్స్‌పై జరుగుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. గతంలో డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి నమూనాలు సేకరించి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి ఫలితాలు తెలుసుకోవడానికి నెలరోజుల సమయం పట్టేది.
అయితే ప్రస్తుతం టీజీన్యాబ్ సహకారం తో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చేస్తున్న దాడు ల్లో ఉపయోగిస్తున్న డ్రగ్స్ డిటెక్షన్ కిట్లు క్షణాల్లోనే ఫలితాలిస్తున్నాయి. అనుమానితుని యూరిన్ శాంపిల్స్ తీసుకుంటే రెండు నుంచి ఐదు నిమిషాల వ్యవధిలోనే అతడు ఏ విధమైన డ్రగ్స్ సేవించాడనేది తెలిసిపోతుంది. 27 రకాల డ్రగ్స్‌ను ఈ డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ గుర్తించగలవని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇటీవల పబ్‌లు, బార్లలో దాడు లు నిర్వహిస్తున్న సందర్భంగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ డ్రగ్స్ డిటెక్షన్ కిట్లను ఉపయోగిస్తున్నారు.






