29 June, 2026 | 10:04 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

ప్రజావాణి విన్నపాలను సత్వరమే పరిష్కరించాలి

10-06-2025 12:55 AM

- జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన విన తు లను బాధ్యతతో సత్వరమే పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయలో సోమవారం జరిగిన ప్రజావాణిలో నగరం నలు వైపుల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కమిషనర్‌కు వి న్నవించారు.

ఈ సందర్భంగా కమిష నర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారం లో సంబంధిత హెచ్‌వోడీలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా మొత్తం 147 దరఖాస్తులు రాగా, అందులో టెలిఫోన్ ద్వారా 4, జోనల్ నుం చి 78 విన్నపాలు వచ్చాయి. చార్మినార్ జో న్ నుంచి 2, ఎల్‌బీనగర్ 11, సికింద్రాబాద్ లో 16, కూకట్‌పల్లి 27, శేరిలింగంపల్లి 22, రాగా జీహెచ్‌ఎంసీ హెడ్‌ఆఫీస్ లో 65 విన్నపాలు అందాయి.

ప్రజావాణిలో కమిషన ర్‌తో పాటుగా అడిషనల్ కమీషనర్ స్నేహ శబరుష్, వేణుగోపాల్, రఘు ప్రసాద్, సీసీ పీ శ్రీనివాస్, వేణుగోపాల్‌రెడ్డి, నళిని పద్మావతి, పంకజ, గీతా రాధిక, సత్యనారాయణ, సామ్రాట్ అశోక్, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్, ఉమాప్రకాశ్, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్, అడిషనల్ సీసీపీలు గంగాధర్, వెంకన్న, ప్రదీప్‌కుమార్, డిప్యూటీ సీఈ పనస రెడ్డి, ఎస్‌ఎన్ డీ పీఎస్‌ఈ పీవీ రెడ్డి, ఏఈ బాలాజీ, హౌసిం గ్ ఈఈ రాజేశ్వర రావు, కులకర్ణి పాల్గొన్నారు.

ఆన్‌లైన్ ద్వారా వినతుల స్వీకరణ

నగర ప్రజలు తమ సమస్యలను ఎపుడై నా జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా విన్నవించవచ్చని కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పేర్కొన్నారు. జీ హెచ్‌ఎంసీ కార్యాలయంలో సోమ వారం జ రిగిన ప్రజావాణి సందర్భంగా గోపనపల్లి డై మండ్ హేట్స్ కాలానికి సంబంధించిన కొం దరు తమ కాలనీ రోడ్డు బాగాలేదని వాట్సప్ గ్రూప్‌లో పోస్టు చేయడంతో, ఆన్‌లైన్‌లో జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేయొద్దని కొందరు గిట్టని వారు ఆదేశిస్తున్నారని కమిషనర్ దృ ష్టికి తీసుకురాగా, నగర ప్రజలు తమ సమస్యలను భౌతికంగానే కాకుండా ఆన్‌లైన్‌లో నూ సమర్పించవచ్చని చెప్పారు.