25 August, 2026 | 3:17 AM

ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి

25-08-2026 01:56 AM

మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్

మల్కాజిగిరి, ఆగస్టు 24 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, సంబంధించిన అధికారులను ఆదేశించారు. సోమవారం మల్కాజిగిరి జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని, వివిధ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలను సమర్థ వంతంగా పరిష్కరించి, ఫిర్యాదుదారులకు త్వరితగతిన ఉపశమనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మల్కాజ్గిరి జోన్ పరిధిలోని వివిధ సర్కిళ్ల నుండి మొత్తం 16 ప్రజా ఫిర్యాదులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఇందులోమల్కాజ్గిరి సర్కిల్ 4, మౌలాలి సర్కిల్  4, బోయిన్పల్లి సర్కిల్ 1, కీసర సర్కిల్ 7 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ జకియా సుల్తానా, సూపరింటెం డింగ్ ఇంజనీర్ లక్ష్మణ్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వి.బి. శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఈ. లౌక్య, జి. కవిత, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ అజయ్, డీడీ (యుబీడీ) బి. శ్రీధర్ రావు, డీఈఈ (ఎస్ డబ్ల్యూ ఎం) ప్రశాంతి, వెటర్నరీ అధికారి డా. టి. సంజయ్, ఏఎంఓ హెచ్ డా. కె.మంజుల తదితరులు పాల్గొన్నారు