9 April, 2026 | 9:37 AM

ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

19-09-2025 08:38 PM

మండల వైద్యాధికారి శ్రావణ్ కుమార్

హుజురాబాద్,(విజయక్రాంతి): ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని శంకరపట్నం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్ అన్నారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మండలంలోని తాడికల్, మొలంగూర్ గ్రామాల్లో ఫ్రైడే డ్రైడే, గ్రామసభ, పోషణ మాసం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిన్నారులు, బాలికలు, మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక చొరవ తీసుకొని పౌష్టికాహారంతో పాటు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి, పౌష్ఠికాహారం ప్రాధాన్యత తెలపడం జరుగుతుందని అన్నారు. అలాగే, మహిళలు, చిన్నారులు పౌష్టికాహారం తప్పక తీసుకోవాలని సూచించారు.