calender_icon.png 19 September, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ మేధో మదన సమావేశనికి బయలుదేరిన నాయకులు

19-09-2025 08:49:51 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): వరంగల్ లో జరిగే బీసీ ల మేధో మదన సభలో కరీంనగర్ జిల్లా నాయకులు వెళ్లడం జరిగింది. ఈ మేధో మదన సమావేశంలో బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు పెంపుపై భవిష్యత్తు కార్యాచరణ బీసీ రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా దసరా పండుగ తరువాత భువనగిరిలో లక్షలాది మందితో నిర్వహించబోయే నవంబర్ 9వ తేదీన జరిగే బహిరంగ సభ బీసీల యుద్ధభేరిని విజయవంతం చేయడానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రాజకీయ కార్యాచరణ, బీసీ ఉద్యమ నిర్మాణ గ్రామ పట్టణ మండల, నియోజకవర్గాల కమిటీల పట్టిష్ట పరచడం, బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాలను బలోపేతం చేయడానికి బీసీ విద్యార్థి యువజన ఉపాధ్యాయ, ఉద్యోగ మహిళ మేధావుల, కళాకారుల సంఘాల, రాష్ట్రస్థాయి సభలు, సమావేశాల్ని నిర్వహించలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రం ఎజెండా ప్రకటించడం జరిగింది.