19-09-2025 08:35:17 PM
సదాశివపేట,(విజయక్రాంతి): సదాశివపేట పట్టణంలోని సెయింట్ ఆంథోనీ పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు. మండలంలోని వివిధ పాఠశాలలో పనిచేస్తున్న 26 మందికి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాన్ని మండల విద్యాధికారి ఎన్.శంకర్ చేతుల మీదుగా అందించడం జరిగింది.
ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ... విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ మీ పాఠశాలకు, మీ గ్రామానికి, అదేవిధంగా మండలానికి మంచి పేరు తీసుకొచ్చి అన్ని విభాగాలలో జిల్లాలో మన మండలాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు.