calender_icon.png 24 May, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాడ్వాయి సొసైటీలో బహిరంగ విచారణ

23-05-2025 11:51:34 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని తాడువాయి ప్రాథమిక సహకార సంఘంలో అక్రమాలు‌ జరిగాయి. అవినీతిపై మూడోరోజు శుక్రవారం విచారణ అధికారి అసిస్టెంట్ రిజిస్టార్ వి. ఇందిరా సొసైటీ కార్యాలయంలో బహిరంగ విచారణ జరిపారు పలువురు రైతులు తీసుకున్న రుణాలు చెల్లించి రసీదులు పొందినప్పటికీ ఖాతాలో జమ చేయకుండా సిబ్బంది స్వహసేసినట్టు గతంలో జరిగిన విచారణలో తేలటంతో సీఈఓ. ఎస్ఏ కంప్యూటర్ ఆపరేటర్లను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. కాగా సొసైటీలో రుణాలు తీసుకొని చెల్లించిన రైతులు బహిరంగ విచారణకు హాజరు  కావాలని విచారణ అధికారి ఐదు రోజుల క్రితం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కోరారు.

విచారణల భాగంగా శుక్రవారం సొసైటీ పరిధిలోని నేలమర్రి. నరసింహుల గూడెం కలకోవా తాడువాయి. గ్రామాలకు చెందిన రైతులు.రాయి పిచ్చయ్య. బుర్రి నరసింహారావు. నలబోలు వెంకటరెడ్డి. నల్లబోవు లక్ష్మి. పాశం రాజేశ్వరి. పుట్టా సైదు.తారకపల్లి ఝాన్సీ.  బుర్రి నరసింహారావు. తాడువాయి గ్రామానికి చెందిన కారంగుల. మాచర్ల వీరయ్య. మండలంలో వివిధ గ్రామా ల రైతులు  పాల్గొన్నారు. అని విచారణ అధికా రి ఇందిరా తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ ఇన్చార్జి సీఈవో చందా ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.