calender_icon.png 24 May, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి సాగుచేస్తే ప్రభుత్వ పథకాలు కట్

24-05-2025 12:00:00 AM

- మాదకద్రవ్యాల కేసులలో జిల్లాలో ఇప్పటి వరకు 90 మంది అరెస్ట్

- యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు: ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, మే 23 (విజయ క్రాంతి): జిల్లాలో మాదక ద్రవ్యాలను ఉక్కు పాదం తో అణివేసేలా అధికారులు  సమన్వయం తో పని చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా  పోలీసులు గంజాయి, మాదకద్రవ్యాలను కట్టడి చేస్తున్నారని, గంజాయి సాగు చేసేవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలాంటివి అందకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్లు తెలిపారు.

తాజాగా భీంపూర్ మండలం తాంసి (కే) గ్రామంలో మంచికంటి అశోక్, ఓంకార్‌ల వ్యవసాయ భూమి లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారన్న పక్క సమాచారంతో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 30 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకొని వారి ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపడం జరిగిందని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా గంజా యి ని అరికట్టడానికి జిల్లా పోలీసు సిబ్బం ది, షీ టీం సిబ్బంది ప్రత్యేకంగా గ్రామీణ పోలీసు మీకోసం కార్యక్రమాల నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారన్నారు.

ప్రజలు మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 50 గంజాయి కేసులు నమోదు కాగా, అం దులో 107 మంది పై కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు 90 మంది అరెస్టు అయ్యారని వారి వద్ద నుండి దాదాపు 26 కిలోల ఎండు గంజాయి, 230 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.

గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేకంగా కళాశాలలో, పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పోలీ సులతో కలిసి యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుంద ని తెలిపారు. అదేవిధంగా గంజాయిని సేవించడం, పండించడం, వ్యాపారం చేయ డం లాంటివి నిషేధం అని, వాటిని నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటు, జిల్లాలో గంజాయిని రూపమాపడం జరుగుతుందని తెలిపారు. 

జిల్లాలో గంజాయిని సేవించిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా గంజాయి కిట్లను ఉపయోగిస్తూ పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి సమాచారనైన  ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా వాట్సప్ ద్వారా 8712659973 నెంబర్ కి అందించవచ్చని, ఈ నెంబర్ జిల్లా ఎస్పీ  పర్యవేక్షణలో ఉంటుందన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.