20-12-2025 01:08:25 AM
నిజామాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): పజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ (సోమవారం) నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.