calender_icon.png 20 December, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలను ప్రోత్సహించడంలో పాఠశాలలు కీలకపాత్ర పోషించాలి

20-12-2025 01:08:10 AM

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుని ఒలంపిక్ విజేత సైనా నెహ్వాల్

మేడ్చల్ అర్బన్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): క్రీడలు ఆరోగ్యంతో పాటు చైతన్య వంతమైన సమాజానికి మూల స్తంభంగా నిలుస్తుందని భారత బ్యాట్మెంటన్ క్రీడాకారిని ఒలంపిక్స్ విజేత పద్మ భూషణ్ సైనా నెహ్వాల్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యకరమైన చైతన్య వంతమైన సమాజానికి మూల స్తంభంగా నిలుస్తుందని శరీరాన్ని మాత్రమే కాకుండా మెదడును కూడా అభివృద్ధి చేయడంలో జీవిత నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ఐక్యత నాయకత్వానికి వేదికలను అందించడంలో సహాయపడతాయని ఆమె స్పష్టం చేశారు.

శుక్రవారం జిహెచ్‌ఎంసి గుండ్లపోచంపల్లి సర్కిల్ పరిధిలో ని డిఆర్‌ఎస్‌ఐఎస్ క్యాంపస్ లో జరిగిన డిఆర్‌ఎస్‌ఐఎస్ సెంటర్ నేషనల్ స్కూల్ 23వ వార్షికోత్సవ క్రీడా పోటీల ముగింపు ఉత్సవాలలో బ్యాడ్మింటన్ కీడాకారిని సైనా నెహ్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నట్లు చెప్పారు.పాఠశాల క్యాంపస్ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్ట్ ను ఆమె ప్రారంభించి విద్యార్థులతో బ్యాడ్మింటన్ ఆడినట్లు పాఠశాల యాజమాన్యం చెప్పారు.

అనంతరం క్రీడా పోటీలలో పాల్గొని విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు ట్రోఫీలతో పాటూ కప్పు సర్టిఫికెట్లను బ్యాడ్మింటన్ క్రీడాకారిని సైనా నెహ్వాల్ చేతుల మీద అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డిజిపి డాక్టర్ అనిల్ కుమార్,డిఆర్‌ఎస్‌ఐఎస్ చైర్మన్ దయానంద్ అగర్వాల్,డైరెక్టర్ లు అంజనీ కుమార్ అగర్వాల్,సంజయ్ అగర్వాల్,గర్వ అగర్వాల్,స్పోరట్స్ చీఫ్ కోచ్ డాక్టర్ మురమళ్ళ భరత్ కుమార్,అడ్మిన్ హెడ్ వినోద రంజన్,వైస్ ప్రిన్సిపాల్ పూజ సక్సేన,హెడ్‌అఫ్ బోర్డింగ్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

డిఆర్‌ఎస్ స్కూల్ చైర్మన్ దయానంద్ అగర్వాల్ మాట్లాడుతూ గుండ్లపోచంపల్లి కార్పొరేషన్ పరిధిలో డిఆర్‌ఎస్‌ఐఎస్ యాజమాన్యం క్రీడల ప్రాముఖ్యతను గుర్తించి క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించి క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్ పూల్ వంటి ప్రతి క్రీడలలో విద్యార్థులకు పాల్గొనేలా చేసి దేశీయ అంతర్జా తీయ పోటీలకు పంపడం అభినందనీయమని చెప్పారు.