11-11-2025 12:10:57 AM
అదనపు కలెక్టర్ సీతారామారావు
సూర్యాపేట, నవంబర్ 10 (విజయక్రాంతి) : ప్రజావాణి దరఖాస్తులకు ఆదిక ప్రాధాన్యతనిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కే.సీతారామారావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని సమా వేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజలనుండి అర్జీలను స్వీకరించారు. ఈ సంద ర్బంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నారు.
తేమ శాతం 17 రాగానే కాంటా వేసి లారీల ద్వారా మిల్లులకు ఎగుమతి చేయాలని అలాగే ట్యాబ్ లో నమోదు చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలకి సంబంధించి 26, ఇరిగేషన్ శాఖకు 4, సంక్షేమ అధికారికి 3, ఎంపిడిఓలకి 2, ఇతర శాఖలకు 9 దరఖాస్తులు వచ్చాయని మొత్తం 44 ధరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ డి ఓ వివి అప్పారావు, డి ఎఫ్ ఓ సతీష్ కుమార్, డి పి ఒ యాదగిరి, డి ఇ ఓ అశోక్, సి పీ ఓ కిషన్, డి డబ్ల్యూ ఓ నరసింహారావు, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్, నరసింహారావు, దయానందరాణి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్, హౌజింగ్ పీడీ సిద్ధార్థ, జిల్లా స్పోరట్స్ అధికారి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.