calender_icon.png 11 November, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

11-11-2025 12:11:50 AM

చిన్న చింతకుంట, నవంబర్ 10 :  మండలం లోని నెల్లికోండి, చిన్న చింతకుంట, మద్దూర్ అల్లీపూర్  గ్రామాలలో  ధాన్యం కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యార్డ్ చైర్మన్ కథలప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను ప్రభుత్వ నిర్ధారిత మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తూకం, చెల్లింపు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, తాసిల్దార్  ఎల్లప్ప, మండల కాంగ్రెస్ పార్టీ ప్రసిడెంట్ నరేందర్ రెడ్డి , దేవరకద్ర మాజీ యూత్ అధ్యక్షుడు ఎస్ వెంకటేష్, మండల ప్రదీప్ రెడ్డి, దామోదర్, బాలు, గ్రామ స్థాయి నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.