calender_icon.png 24 July, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండా

23-07-2025 12:00:00 AM

ఇల్లందు టౌన్, జులై22 , (విజయక్రాంతి):రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మంగళవారం స్థానిక సిఈఆర్ క్లబ్ నందు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను, రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెం టీలలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వందశాబ్ద కాలంలో ఒక్క రేషన్ కార్డును కూడా మంజూరు చేయలేదన్నారు.

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు ఆర్థిక భారం కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి చెక్కులను అర్హులైన పేదలందరికీ అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బానోత్ రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బోడా మంగీలాల్, మాజీ వైస్ ఎంపీపీ మండల్ రాము, మాజీ మున్సిపల్ చైర్మన్ దంపలపాటి వెంకటేశ్వర రావు, మండల అధ్యక్షులు పులి సైదులు, కిన్నెర నర్సయ్య, పూణెం సురేందర్, తాటి భిక్షం, ఆర్‌ఎం కిరణ్, ఎట్టి హరికృష్ణ, దండగుల ఆనంద్, ఈసం లక్ష్మణ్, తాటి పద్మ, మోకాళ్ళ వెంకటమ్మ, పాయం స్వాతి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.