calender_icon.png 23 July, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారం

23-07-2025 12:00:00 AM

జడ్జ్ రాధిక జైస్వాల్

రాజన్న సిరిసిల్ల: జులై 22 (విజయక్రాంతి): జిల్లాలోనిమధ్యవర్తిత్వం ద్వారా వివిధ పౌర కుటుంబ సంబంధిత వివాదాలను. శాంతియుతంగా పరిష్కరించడమే.లక్ష్యంగా మధ్యవర్తిత్వం కార్యక్రమం నిర్వహించబడుతోందని సీనియర్ సివిల్ జడ్జి, కం. జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కా ర్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికర సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికర సంస్థ, రాజన్న సిరిసిల్ల అధ్యక్షురాలు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సె షన్స్ జడ్జ్ . పి. నీరజ. సూచనల మేరకు 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణా కార్యక్రమం కోసం సిరిసిల్ల వేములవాడయొక్క ఆసక్తిగల న్యాయవాదుల జాబితాను తెలంగాణ రాష్ట్ర న్యాయ సే వాధికర సంస్థ, హైదరాబాద్ కు పంపడం జరిగిందని కార్యదర్శి రాధిక జైస్వాల్ తెలిపారు.

ఈ సందర్భంగా కార్యదర్శి రాధిక జైస్వాల్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకుంటే కోర్టులో నడిచే ఖర్చు, సమయం మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు.ఇరు పక్షాల సమ్మతితో నిపుణుల ద్వారా సమస్య పరిష్కారం పొందే అవకాశమిది అని అన్నారు.ఈ మధ్యవర్తిత్వం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లాలోని కక్షిదారులను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కోరారు.