13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

మాఘ అమావాస్యకు పుల్లూరు బండ జాతర వాల్ పోస్టర్ విడుదల

09-01-2026 06:19 PM

సిద్దిపేట రూరల్: బండపై వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఉత్సవ కమిటీ చైర్మన్, గ్రామ సర్పంచ్, ఆలయ అర్చకులు ఈనెల 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు పుల్లూరు బండపై వెలసిన శ్రీ స్వయంభు లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మాఘ అమావాస్య ను పురస్కరించుకుని జాతర ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పుల్లూరి కనకయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ లతా వెంకట్ లు తెలిపారు.

శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆలయ వంశపారంపర్య అర్చకులు చిలకమర్రి వెంకట ఫణి కుమారాచార్యులు తో కలిసి వారు జాతర ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 17వ తేదీ పుల్లూరు గ్రామంలోని హై స్కూల్ నుండి రథయాత్రతో జాతర ఉత్సవాలను ప్రారంభిస్తామని, 18న పవిత్ర స్నానాలు, విష్ణు సహస్రనామ పారాయణం, 19న గోపాల కాలువలు, 20న లక్ష్మీనరసింహస్వామి కళ్యాణాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

21వ తేదీ చక్రతీర్థముతో జాతర ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి తో పాటు, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు లను ఆహ్వానించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ ఒగ్గు రాజేష్, ఉత్సవ కమిటీ డైరెక్టర్లు పెండ్యాల దేవి రెడ్డి, ఒగ్గు యాదయ్య, గొడుగు రవి, రాములు, కిష్టయ్య, వార్డు మెంబర్ లు యోగేష్, ప్రవీణ్, యాదిగిరి, వేణుచార్యులు, కాంగ్రెస్ నాయకులు గరిపల్లి రాములు, గడ్డం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.