calender_icon.png 10 January, 2026 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్రెపల్లి మోడల్ స్కూల్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

09-01-2026 06:22:54 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మోడల్ స్కూల్ లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.గొల్డి బల్బీర్ కౌర్ మాట్లాడుతూ మన దేశం పండుగలకు నిలయమని అందులో ముఖ్యంగా రైతుల పండుగ అతిపెద్ద పండుగ ఈ  సంక్రాంతి. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు అని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గర్రెపల్లి గ్రామ సర్పంచ్  వీరగొని రమేష్ గౌడ్, నర్సయ్యపల్లి గ్రామ సర్పంచ్ జూపల్లి తిరుమల రావు లుపాల్గొన్నారు. భోగి మంటలతో ఈ వేడుకలు ప్రారంభించి, సంక్రాంతి సాంప్రదాయ వంటకమైన "పాల పొంగలి" తయారు చేశారు. విద్యార్థినీ, విద్యార్థులకు భోగి పండ్లు పోశారు. తర్వాత మధ్యాహ్న సమయంలో బాలికలకు ముగ్గుల పోటీలు, బాలురకు పతంగుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో బాగంగా ఇద్దరు సర్పంచులను ప్రిన్సిపాల్  ఘనంగా సన్మానించారు.