calender_icon.png 10 January, 2026 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

09-01-2026 06:16:31 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): బైక్ పై నుండి పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన తాండూరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని తాండూరు గ్రామానికి చెందిన కర్రోళ్ల రాజు కుటుంబ సమేతంగా హైదరాబాదులో ఉంటూ కూలిపని చేసుకుని జీవనం కొనసాగించేవారు.

కర్రోళ్ల రాజు భార్య నెల రోజుల క్రితం భార్య నందిని అమ్మవారి ఇంటికి వెళ్లి అక్కడే ఉండగా నందిని ఈనెల మూడవ తేదీన భర్త రాజు మెదక్ నుండి తాండూర్ గ్రామానికి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు తన బైకుపై వెళ్లారు.మార్గమధ్యంలో గోపాల్పేట్ ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఫిర్యాదురాలి నందిని తన భర్త బండి అదుపు తప్పి కిందపడటం వల్ల తలకి బలమైన గాయాలు కావడంతో ఫిర్యాదురాలి నందిని తన అత్తమామల ద్వారా తెలియడంతో వెంటనే గాయాల పాలైన రాజుకి చికిత్స నిమిత్తం నిజామాబాద్ నుండి హైదరాబాద్ ఉస్మానియాకి తీసుకొని వెళ్లడం జరిగిందని చికిత్స పొందుతూ ఎనిమిదవ తేదీన సాయంత్రం 6 గంటలకు చనిపోయాడు.అట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.