calender_icon.png 10 October, 2025 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12న ఘట్ కేసర్‌లో పల్స్ పోలియో

10-10-2025 12:00:00 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ మున్సిపాలిటీ పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కమిషనర్ కె. రాజేష్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడి కేంద్రాలు, విద్యా సంస్థలు మరియు ప్రత్యేక పోలియో బూత్ లలో ఆదివారం ఉదయం 8 నుండి సాయం త్రం 5 వరకు అలాగే ప్రత్యేక కేంద్రా లు రైల్వే స్టేషన్, ప్రధాన బస్సు స్టాప్, ప్రభుత్వ ఆసుపత్రిల వద్ద 24 గం టలు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు.

 మున్సిపాలిటీలోని తల్లి తండ్రులు, సంరక్షకులు, ప్రజలు అందరూ  కార్యక్రమoలో పాల్గొని విజయవంతం చేసి మన పిల్లలను పోలియో నుంచి కాపాడుకుందామని, పోలియో రహిత సమా జాన్ని నిర్మించుకుందామని మున్సిపల్ కమిషనర్ రాజేష్ కోరారు.