10-10-2025 03:08:07 PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో ఉన్న కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి(Congress MLA Kasireddy Narayana Reddy) చెందిన బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగింది. కళాశాల నుండి గుర్తు తెలియని వ్యక్తులు రూ.1 కోటి దొంగిలించినట్లు సిబ్బంది ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్యాంపస్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కేసు నమోదు చేసి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. దొంగతనానికి పాల్పడిన వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.