10-10-2025 03:15:26 PM
తుంగతుర్తి సివిల్ కోర్ట్ జడ్జి గౌస్ పాషా
తుంగతుర్తి,(విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రత ,సామాజిక బాధ్యత అని జూనియర్ సివిల్ జడ్జి ఎండి. గౌస్ పాషా అన్నారు. శుక్రవారం తుంగతుర్తిలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రం చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులు యువత, ప్రజలకు అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.