10-10-2025 02:10:17 PM
హైదరాబాద్: రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని కావాలనేది తన ముఖ్య ఉద్దేశమని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టికెట్ ఆశించిన అంజన్ కుమార్ యాదవ్ నిరాశకు గురయ్యారు. ఆయన ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ ఆయనను బుజ్జగించారు. తనను సంప్రదించకుండా అభ్యర్థిని ప్రకటించడంపై అంజన్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం అంజన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో సేవలందించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) కష్టకాలంలో పార్టీ అండగా ఉన్నానని చెప్పారు. కరోనా సమయంలో(Corona time) కార్యకర్తలు, ప్రజలకు సేవలందించానని వివరించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 11న జరగనున్న ఉపఎన్నికకు తమ అభ్యర్థిగా వి. నవీన్ యాదవ్‌ను బుధవారం తెలంగాణ అధికార కాంగ్రెస్ ప్రకటించింది. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. యాదవ్ 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోనిఎంఐఎం పార్టీ తరపున, 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2023లో నవీన్ యాదవ్ కాంగ్రెస్‌లో చేరారు.