10-10-2025 03:17:11 PM
కాపాడిన మత్స్యకారులు
అలంపూర్: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి వద్ద కృష్ణానది బ్రిడ్జిపై శుక్రవారం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కొండపేట గ్రామానికి చెందిన మత్స్యకారులు నదిలోకి దూకి మహిళను సురక్షితము ఒడ్డుకు చేర్చారు.ఆత్మహత్యకు పాల్పడిన మహిళ హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతానికి చెందిన జయశ్రీ గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే మహిళ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.అయితే మత్స్యకారులు తక్షణమే స్పందించి మహిళను రక్షించడంతో స్థానికులు వారిని అభినందించారు.