calender_icon.png 10 October, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు మద్దతు ధర ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం

10-10-2025 03:14:13 PM

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 

దౌల్తాబాద్‌: ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో దౌల్తాబాద్,కోనాపూర్ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు తహశీల్దార్ చంద్రశేఖర్ రావు, ఇంచార్జ్ ఎంపీడీవో సయ్యద్ గఫూర్ ఖాద్రీ, డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ మహిపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వ కేంద్రాలకే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచించారు.

ఏ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర రూ.2,389గా, సాధారణ ధాన్యానికి రూ.2,369గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.అలాగే సన్న రకం వడ్లకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ.500 బోనస్ అందజేస్తుందని తెలిపారు.రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించి ధాన్యాన్ని తేమ లేకుండా కొనుగోలు  కేంద్రాలకు తెచ్చి విక్రయించాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం రైతుల శ్రమకు తగిన మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా వడ్ల కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు రాజేశ్వర్,సిద్ధి రాములు,సీఏలు యాదగిరి,కవిత తదితరులున్నారు.