calender_icon.png 10 October, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్‌కు నిరాశ.. మరియా కొరినా మచాడోకు నోబెల్‌ శాంతి బహుమతి

10-10-2025 02:51:02 PM

ఓస్లో: నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించారు. వెనెజువాలాకు చెందిన మరియా కులీనా మచాడోకు(Maria Corina Machado) నోబెల్ శాంతి పురస్కారం వరించింది. ఈ ఏడాది నోబెల్ శాంతి(Nobel Peace Prize) పురస్కారానికి 338 మంది నామినేట్ అయ్యారు. నోబెల్ శాంతి పురస్కారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలు పెట్టుకున్నాడు. ట్రంప్ కు నోబెల్ శాంతి పురస్కారం వస్తుందా? లేదా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరియా కొరీనాకు శాంతి పురస్కారం రావడంతో ట్రంప్ ఆశలు ఆవిరయ్యాయి. నోబెల్ శాంతి పురస్కారం ఆశించిన ట్రంప్ కు నిరాశ మిగిలింది. ప్రజల హక్కుల కోసం పోరాడినందుకు మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య దిశగా వెనుజులాను నడిపించినందుకు నోబెల్ వరించింది. వెనెజులాలో శాంతియుతంగా మార్పు తీసుకొచ్చినందుకు మచాడోకు నోబెల్ నోబెల్ శాంతి పురస్కారం నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం నిర్ణయించింది..