24-05-2025 12:00:00 AM
-నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్ మే 23 (విజయక్రాంతి): ఆయిల్ ఫామ్ తోటలు సాగుచేసిన రైతుల ప్రజలను కోసమే నిర్మల్ జిల్లా కేంద్రంలో పామాయిల్ గెలల కేంద్రాన్ని ప్రారంభిస్తున్న టు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో కొనుగోలు కేంద్రా న్ని జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించా రు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభు త్వం రైతులకు అన్ని రకాల సాయసహాకారలు అందించడానికి సిద్ధంగా ఉందని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, రావుల రాంనాథ్, ముత్యంరెడ్డి , నాయకులు సాదం అరవింద్, జమాల్, చంద్రకాంత్, దినేష్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.