calender_icon.png 24 May, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త తహశీల్దార్ కు శుభాకాంక్షలు తెలిపిన టిబిజికెయస్ నాయకులు

24-05-2025 10:48:33 AM

మణుగూరు,(విజయక్రాంతి): మణుగూరు మండల రెవిన్యూ అధికారిగా కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అద్దంకి నరేష్ ను శుక్రవారం మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు  మర్యాద పూర్వకంగా కలిశారు.. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం  అందించి శుభాకాంక్షలు తెలియచేశారు. మణుగూరు ఏరియా కు గుండెకాయ రానున్న రోజుల్లో కార్మిక మనుగడలో అత్యంత కీలక భూమిక పోషించే  మణుగూరు ఓ సి  ప్రాజెక్ట్ ఎక్స్ టెన్షన్ అంశంలో ప్రత్యేక చొరవ చూపించి త్వరితగతిన  అనుమతులు రాబట్టి  ఏరియా ప్రగతికి దోహద పడాలని ఈ  సందర్భంగా కోరారు.. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు