గుట్టలో వరుణయాగం పూర్ణాహుతి
24-07-2026 12:20 AM
హాజరైన మంత్రి కొండా సురేఖ
యాదగిరిగుట్ట, జూలై 23 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య గురువారం దర్శించుకున్నారు. లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన పర్వత వర్ధిని రామలింగేశ్వరాలయంలో నాలుగవ రోజు వరుణ యాగం పూర్ణాహుతిలో వారు పాల్గొన్నారు.
అనంత రం మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఈ యాగం తో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కులసి సమస్త జీవకోటికి, పాడిపంటలకు, తాగు సాగునీటికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని కాంక్షించారు. వారివెంట ఈఓ భవాని శంకర్, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ధర్మకర్త లక్ష్మీ నారాయణ నాయక్ ఉన్నారు.






