రూ.69 కోట్ల ధాన్యం మాయం
- సూర్యాపేటలో రెండు రైస్ మిల్లులు సీజ్
- ఈ నెల 20న అధికారుల తనిఖీలు
సూర్యాపేట రూరల్, జూలై 23 (విజయక్రాం తి): సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలోని వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మార్ట్‌లలో నల్గొండ విజిలెన్స్, పౌర సరఫరాల అధికారుల సంయుక్త బృందం విశ్వసనీయ సమాచార మేర కు ఈ నెల 20న ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో వేరే మిల్లు పేరిట ఎఫ్‌సీఐకి లారీల్లో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు అడ్డుకుని, బియ్యంతో పాటు వాహనాలను స్వాధీ నం చేసుకున్నారు.
అనంతరం నిర్వహించిన భౌతి క ధృవీకరణలో రికార్డుల ప్రకారం ఉండాల్సిన ధాన్యంలో భారీ తేడాలున్నట్లు వెల్లడైంది. వజ్ర రైస్ కార్పొరేషన్‌లో 11,073.054 టన్నులు, వజ్ర వికాస్ రైస్ మార్ట్‌లో 18,114.834 మెట్రిక్ టన్ను లు చొప్పున మొత్తం 29,187.888 టన్నుల ధా న్యం కొరత ఉన్నట్లు నిర్ధారించారు.
ప్రాథమిక అం చనా ప్రకారం ఈ మాయమైన ధాన్యం విలువ సుమారు రూ.69 కోట్లుగా తేలింది. ఈ అక్రమాలపై జిల్లా పౌర సరఫరాల అధికారి సమక్షంలో పంచనామా నిర్వహించి మిల్లులోని మిగిలిన నిల్వలను సీజ్ చేయడంతో పాటు, క్రిమినల్ కేసులు, రికవరీ చర్యలు ప్రారంభించారు. లభ్యమైన ధాన్యా న్ని ఇతర మిల్లులకు తరలించాలని జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు.






