calender_icon.png 5 August, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నత చదువులు అభ్యసించి ఉత్తమ లక్ష్యాలను సాధించాలి

05-08-2025 12:28:32 AM

సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలును సందర్శించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్

జనగామ, ఆగస్టు 4 (విజయక్రాంతి): రెసిడెన్షియల్ స్కూల్లో స్టాక్ రూమును సందర్శించి విద్యార్థుల భోజనం కొరకు వినియోగిస్తున్న సామాగ్రిని పరిశీలించిన అరవింద్ కుమార్ విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను జిల్లా కలెక్టర్ తో కలిసి స్వయంగా పర్యవేక్షించిన ... అరవింద్ కుమార్ సోమవారం పట్టణం లోని హనుమకొండ రోడ్డులో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు ను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పర్యవేక్షించారు.

తొలుత రెసిడెన్షియల్ స్కూల్ వద్ద కు చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్   మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వన మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ లు కలిసి మొక్కలు నాటారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ లకు విద్యార్థులు పుష్ప గుచ్చాలు అందించి గార్డ్ ఆఫ్ ఆనర్ పలికి ఘనంగా  పాఠశాలలోకి స్వాగతం పలికారు.

పాఠశాలలో భోజనశాలను సందర్శించి పరిశుభ్రతను పరిశీలించారు. వంటగదిని సందర్శించి వండిన ఆహార పదార్థాలను  పరిశీలించారు. విద్యార్థుల కొరకు తెప్పించిన వంట సామాగ్రి స్టాక్ రూమును సందర్శించి వస్తువుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం  విద్యార్థులతో  కలిసి ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ భోజనం చేస్తూ విద్యార్థులతో మాట్లాడారు భోజనం బాగుంటుందా మెను ప్రకారంగా ఆహారం పెడుతున్నారా అని పలు ప్రశ్నలు వేశారు.

ఈ సందర్భంగా అరవింద్ కుమార్ విద్యార్థులతో  శ్రద్ధగా చదువుకోవాలని క్రమశిక్షణతో మెలగాలన్నారు ప్రభుత్వం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కొరకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నందున ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత చదువు లు అభ్యసించి  నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, జిల్లా బాలికల పర్యవేక్షణ అధికారి గౌసియా బేగం, సివిల్ సప్లై డిటి లు శ్రీనివాస్, లచ్చు నాయక్,  విద్యార్థులు పాల్గొన్నారు.