calender_icon.png 5 August, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

05-08-2025 12:29:49 AM

ముదిరాజ్ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు దొడ్ల సదానంద్ ముదిరాజ్

ముషీరాబాద్, ఆగస్టు 4(విజయక్రాంతి):  కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్‌లో ముదిరాజులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ముదిరాజ్ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు దొడ్ల సదానంద్  ముదిరాజ్, సంఘం  రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు పొట్లకాయల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

ఈ మేరకు సోమవారం ముదిరాజ్ సంఘానికి విశేష సేవలు అందిస్తున్న ముదిరాజ్ సీనియర్ సిటిజెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న పొల్లు నరేష్ ముదిరాజును  వారు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థికంగా,  సామాజికంగా,  రాజకీయంగా  అన్ని రంగాల్లో వెనుకబడిన ముదిరాజులను బిసి ‘డి’ గ్రూప్ నుంచి బీసీ ‘ఏ’ గ్రూప్ కు మార్చాలని వారు డిమాండ్ చేశారు.

గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ముదిరాజుల అభివృద్ధిని పట్టించుకోలేదని  వారు ఆరోపించారు.  కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కామారెడ్డి నిక్లరేషన్ లో ముదిరాజ్ ల కు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చి ముదిరాజులకు న్యాయం చేయాలని  విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు   మోహన్ ముదిరాజ్,  టి. సురేందర్ ముదిరాజ్,  ముదిరాజ్, శ్రీకాంత్,  లక్ష్మీనారాయణ,  నరసింహ,  రాజారన్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.