calender_icon.png 9 December, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట ప్రాంతానికి తొలివెలుగు పీ.వీ రాజేశ్వరరావు

09-12-2025 01:55:41 AM

సిద్దిపేట, డిసెంబర్ 8 (విజయక్రాంతి): సిద్దిపేట ప్రాంతానికి విద్యుత్ కాంతి తో పాటు విద్యా కాంతులను పంచిన మహనీయుడు పివి రాజేశ్వరరావు అని ఎమ్మెల్సీ లు దేశపతి శ్రీనివాస్, సురభి వాణి లు కొనియాడారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట ఆటానమస్ లో ఏర్పాటు చేసిన పి వి రాజేశ్వరరావు శతజయంతి కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులతో పాటు, శాసనమండలి సభ్యులు, కళాశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో బూర్గుల రామకృష్ణ రావుతో మాట్లాడి సిద్దిపేట కు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపిన కళాశాల మలిదశ తెలంగాణా ఉద్యమానికి నాయకత్వాన్ని అందించింది అన్నారు.

పీ.వీ నర్సింహా రావు కూతురు సురభి వాణి మాట్లాడుతు ముందు చూపుతో, దార్శనికతతో చేసిన గొప్ప పనులు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అటువంటి నాయకుడే పీ.వీ రాజేశ్వరరావు అని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి సునీత మాట్లాడుతూ 1956లో 36 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల మహోన్నతంగా ఎదిగి 22 యూజీ కోర్సులు,

12 పీజీ కోర్సులతో 4500 మంది విద్యార్థులతో రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థగా ఎదిగి, ఎంతోమంది ఐఏఎస్ అధికారులను, రాజకీయ నాయకులను, ఉద్యోగులను, సామాజికవేత్తలను, కళాకారులను అందించినందుకు సంతోషిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు ఫారూఖ్ హుస్సేన్, దేవిప్రసాద్, డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, డా పాపయ్య, ఏం రాఘవేందర్రావు, డా. పి అయోధ్య రెడ్డి, తో పాటు వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.