calender_icon.png 11 December, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలంకన్నా ముందుడేవాడే కవి

09-12-2025 01:56:48 AM

తెరవే రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి 

సిద్ధిపేట క్రైం, డిసెంబర్ 8 : కాలం కన్నా క్షణం ముందుండి, రాబోయే ఉపద్రవాన్ని పసిగట్టి సమూహాన్ని అప్రమత్తం చేసేవారే కవులు, రచయితలుగా నిలదొక్కుకోగలుగుతారని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన సీనియర్ కవి మహమూద్ పాషా కవిత్వసంపుటి ‘కలవా ర‘ఆవిష్కరణసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

మూడు దశాబ్దాల క్రితం ప్రపంచీకరణ ప్రభావంవల్ల రాబోయే పరిణామాలను ఊహించి కవులు రచయితలు తమ రచనల ద్వారా ముందస్తు హెచ్చరికలు జారీచేసినప్పుడు అందరూ తేలికగా కొట్టిపారేశారని అన్నా రు. ప్రతీదీ ఆర్థిక సంబంధమైపోయిందని, అవినీతి బంధుప్రీతి అరాచకత్వం పెచ్చుమీరి వనరుల విధ్వంసం యధేచ్ఛగా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

యువతరం పు రస్కారాల కోసం పాలక పక్షాల భజనపరులుగా మారకూడదని, ప్రజలపక్షం వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్కపెల్లి యాదగిరి, గఫూర్ శిక్షక్, కార్యదర్శులు ఉప్పలపద్మ, ఆడెపులక్షణ్, తౌడబోయిన తిరుపతి, వంగర నరసింహారెడ్డి, అశోక్ రాజు, కొమురవెల్లి అంజయ్య, స్రవంతి మహిపాల్, మోరమోహన్, త్రివిక్రమశర్మ, ఉమాశంకర్, మహెందర్, సుధాకర్, శ్రీధర్, ఎడ్లలక్ష్మి, వెంకటేశ్వర్లు, సాజిత్, సర్దార్ హుస్సేన్, కవులు రచయితలు సాహిత్యాభిమానులు మహమూద్ పాషా బంధుమిత్రులు పాల్గొన్నారు.