calender_icon.png 9 December, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలను పాటించాలి

09-12-2025 01:54:24 AM

జిల్లా కలెక్టర్ కె.హైమావతి 

సిద్ధిపేట కలెక్టరేట్,డిసెంబర్:8 జిల్లాలో నిర్వహించనున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేం దుకు అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం గా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. గజ్వేల్ మం డలంలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించిన గ్రామాల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లి, సింగాటం, జాలిగామ గ్రామాల పోలింగ్ స్టేషన్లను కలెక్టర్ సందర్శించారు. శ్రీగిరిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, సింగాటం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల, జాలిగామ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు.ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పో లింగ్ స్టేషన్లలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు.

విద్యు త్ సరఫరా, లైట్స్, ఫ్యాన్లు, ర్యాంపులు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, తాగునీటి వసతి వంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు కావడంతో లైవ్ వెబ్కాస్టింగ్ నిర్వహించేందుకు నెట్ కనెక్షన్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అలాగే పోలింగ్ స్టేషన్లలో కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను ముందుగానే పూర్తిచేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వోటర్ స్లిప్ల పంపిణీని 100 శాతం పూర్తి చేయాలని బీఎల్‌ఓలకు స్పష్టం చేశారు. ఎ న్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలకు తావివ్వకుండా సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.