30 June, 2026 | 1:44 AM

భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన గొప్ప మేధావి పీవీ

30-06-2026 12:00 AM

తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్

ముషీరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన గొప్ప మేధావి పివి నరసింహారావు అని తెలంగాణ గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ కొనియాడారు. సోమవారం రవీంద్ర భారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో భారతరత్న భారతదేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు105 వ జయంతి సభ జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్, విశిష్ఠాధిపతి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఎన్. బాలా చారి, కార్యక్రమ నిర్వహణ తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షులు పి. బడే సాబ్ కార్యక్రమానికి సభాధ్యక్షులు ప్రముఖ కవి విమర్శకులు  రామకృష్ణ చంద్రమౌళి, విశిష్ట అతిథులు సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ, శ్రీ సంగం రామేశ్వరయ్య, ఇఎన్టి హాస్పిటల్ డాక్టర్ రవి శంకర్ ప్రజాపతి, పాలడుగు సరోజినీ దేవి, రాధా కుసుమ, కుసుమ ధర్మన్న, చైర్ పర్సన్  సత్యనారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ పీవీ నరసింహా రావు గొప్ప జ్ఞాని,  భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన మేధావి,  వందేమాతరం నినాదం వద్దు అంటే వందేమాతరం ఉద్యమాన్ని నడిపి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బయటకు పోయి నాగపూర్ లో చదివి చైతన్యపరిచిన వ్యక్తి పీవీ నరసింహారావు ఆయన చేసిన సేవ భారతదేశానికి వేల లేనివని అన్నారు.  పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలు నేడు ప్రపంచ దేశాలన్నీ అనుసరిస్తున్నాయని, అది మన తెలంగాణ బిడ్డ యొక్క గొప్పతనమన్నారు. మరో అతిథి డాక్టర్ ఎన్. బాలా చారి, ప్రముఖ కవి రామకృష్ణ చంద్రమౌళి లో మాట్లాడారు.