20-06-2025 12:05:34 AM
-భారత్ నుంచి చోటు దక్కించుకున్న 54 యూనివర్సిటీలు
-దేశం నుంచి టాప్ స్థానం దక్కించుకున్న ఐఐటీ ఢిల్లీ
న్యూఢిల్లీ, జూన్ 19: క్యూఎస్ వరల్డ్2026 యునివర్సిటీ ర్యాంకింగ్స్ గురువారం విడుదలయ్యాయి. ఈ ర్యాంకింగ్స్‌ను గ్లోబల్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఎనలిస్ట్ క్యూఎస్ క్వాక్వారెల్లి సైమండ్స్ సంస్థ విడుదల చేసింది. ఈసారి ర్యాంకింగ్స్‌లో భారత్ మంచి పురోగతి సాధించింది. రికార్డు స్థాయిలో 54 యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు ప్రతిష్ఠాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
దేశం నుంచి ఐఐటీ ఢిల్లీ అత్యుత్తమ ర్యాంకు సాధించింది. ఈ ఏడాది ఐఐటీ ఢిల్లీ 123వ ర్యాంకు సాధించగా.. ఐఐటీ ముంబై 129వ స్థానానికి పడిపోయింది. ఇక తెలంగాణ నుంచి హైదరాబాద్ యునివర్సిటీ ఈ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 801 ర్యాంకుల మధ్య యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నిలిచింది. 2026 ఎడిషన్‌లో ‘సైటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీ’ జాబితాలో హైదరాబాద్ యునివర్సిటీ 355వ ర్యాంకు సాధించడం విశేషం.