29 June, 2026 | 10:05 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన

07-06-2025 01:07 AM

స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్

నారాయణపేట జిల్లాలో ప్రారంభమైన బడి బాట కార్యక్రమం

నారాయణపేట, జూన్ 6 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనతో పాటు చక్కటి వసతి సౌకర్యాలు ఉన్నాయని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాం గ్వర్ తెలిపారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలోని కోస్గి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠ శాలలో ఏర్పాటు చేసిన బడిబాట గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య చక్కటి వసతులు అల్పాహారం పోషకాహారం అందించ డమే కాకుండా ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ ఇస్తారన్నారు. ప దవ తరగతిలో వెనకబడ్డ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి మెరుగైన ఉత్తీర్ణత కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు.

అలాగే ప్రత్యేక అవసరా లు గల విద్యార్థుల కోసం అన్ని పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులు, తరగతి గదుల్లో అ త్యాధునికమైన డిజిటల్ బోర్డుల ద్వారా బోధించడం జరుగుతుందని, ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం ద్వారా వెనకబడ్డ విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు, ఎక్సెల్ ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో డిజిటల్ బోధన తదితర అధునాతన బోధనా కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వి ద్యాశాఖ అధికారి గోవిందరాజు, ఎంఈఓ శంకర్ నాయక్, తహసిల్దార్ బక్క శ్రీనివాసులు, ఎం పీడీవో శ్రీధర్, సీఎంఓ రాజేంద్రకుమార్, మధ్యాహ్న భోజన జిల్లా సమన్వయకర్త యాదయ్య శెట్టి, మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, డిపిఎం సదానందం, మున్సిపల్ కమిషనర్ నాగరాజు తదితరులుపాల్గొన్నారు.