18 April, 2026 | 3:52 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

13-06-2025 01:41 AM

బూర్గంపాడు, జూన్ 12(విజయక్రాంతి) ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఎం.నాగరాజ శేఖర్ అన్నారు. గురువారం బూర్గంపాడు మండలంలోని మారుమూల ప్రాంతమైన బత్తుల నగర్ ప్రా థమిక పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల స మావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఈ పాఠశాలలో 45మంది పిల్లలు చదువుతుండడం చాలా ఆనందకరమని, ఈ స్ఫూర్తిని ఇదేవిధంగా కొనసాగిస్తూ పాఠశాలను ఆదరించాలని అన్నారు. 1వ తరగతిలో నూత నంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేశారు. పాఠశాల ఆవరణలో మంచి మొక్కలు నాటి ప్రకృతి హితంగా చేయాలని ప్రధానోపాధ్యాయునికి సూచించారు.

పాఠశాలకు కావలసి న అవసరాలైన శుభ్రపరచబడిన తాగునీటి వసతి, ఆటస్థలం చదును చేయడం వంటి వాటికి ఎఎపీసీ ద్వారా ప్రతిపాదనలు పం పాలని ప్రధానోపాధ్యాయునికి సూచించా రు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలకృష్ణ, సహోపాధ్యాయుడు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాల్గొన్నారు.